సోమవారం 03 ఆగస్టు 2020
Rangareddy - Jul 13, 2020 , 00:01:52

శుభ్రం చేద్దాం వ్యాధులను నివారిద్దాం

శుభ్రం చేద్దాం వ్యాధులను నివారిద్దాం

  • స్వచ్ఛత కోసం ప్రతి ఆదివారం పది నిమిషాలు కేటాయించండి
  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ‘ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు, పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని నివాస గృహంలో (మిద్దె)పైన గల గార్డె న్‌లో వివిధ రకాల మొక్కల కుండీలను శుభ్ర పరిచారు. నిలువ ఉన్న నీటిని తొలగించి, మందును పిచికారీ చేశారు.మనుమడు ఇంద్ర(ఇంద్రారెడ్డి)తో కలిసి మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలన్నారు. ఇందులో భాగంగా నీరు నిల్వ ఉండే డ్రమ్ములు, కూలర్‌లో వారంలో ఒకసారి పూర్తిగా నీళ్లు తీసేసి శుభ్రం చేసుకొని వాడుకోవాలని, లేనట్లయితే అందులో లార్వా వృద్ధి చెంది తద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, ఫైలేరియా, మెదడువాపు తదితర సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరు అందరి ఆరోగ్యం కోసం, తప్పక పది నిమిషాలు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పల్లెప్రగతి, పట్టణాల్లో పట్టణ ప్రగతి ద్వారా స్వచ్ఛ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.


logo