గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 12, 2020 , 00:32:42

‘నియంత్రిత’పై ఆసక్తి

‘నియంత్రిత’పై ఆసక్తి

  • రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 2,55,264 హెక్టార్ల సాగు లక్ష్యం
  • ఇప్పటికే 65 శాతం పంటలు సాగు చేసుకున్న రైతులు
  • నియంత్రిత పంటల సాగుపై రైతన్నల ఆసక్తి 
  • జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి
  • నాగరకుంటలో పంటల వివరాల సేకరణను పరిశీలించిన జేడీఏ

షాబాద్‌ : జిల్లాలో రైతులు వానకాలంలో సాగు చేసిన పంటల వివరాలను ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నాగరకుంటలో పర్యటించి రైతుల నుంచి వివరాల సేకరణ, సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానకాలంలో 2,55,264 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 65 శాతం పం టలు సాగు చేశారన్నారు. అందులో పత్తి 1,97,165 హెక్టార్లు, జొన్న 10,788 హెక్టార్లు, కంది 31,685, పెసర 366 హెక్టార్లలో సాగు చేశారన్నారు. త్వరలో వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపారు. రైతులు నియంత్రిత పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. గ్రా మాల్లో ఏ రైతు ఏ సర్వే నంబర్‌లో ఏ పంట వేశారో తప్పనిసరిగా వివరాలు తెలియజేయాలన్నారు. రైతు ఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాలన్నారు.

ఈ వివరాల ప్రకారం రైతులు ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారో తెలుస్తుందని, దీంతో ప్రభుత్వం పంట కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రభు త్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి పంటల వివరాల సేకరణపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఎలాంటి తప్పులు లేకుండా పంటల వివరాల సేకరణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. రైతులు ఏఈవోలకు తమ పంటల వివరాలు అందించాలని చెప్పారు. ఈ సర్వే ప్రకారం రైతులు పం డించిన పంటలను ఇబ్బంది లేకుండా అమ్ముకునేందుకు ప్రభుత్వం చర్య లు చేపడుతుందన్నారు. పంటల వివరాలను ఈ నెల 21వ తేదీ లోపు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో  ఏవో వెంకటేశం, ఏఈవోలు రాఘవేందర్‌, కిరణ్మయి, రైతులు పాల్గొన్నారు.