ముంబై, ఏప్రిల్ 14: వాల్ట్ డిస్నీ, స్టార్ ఇండియా కంపెనీ ప్రెసిడెంట్‌గా కే మాధవన్ నియమితులయ్యారు. ఆయన నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019 నుంచి స్టార్, డిస్నీ ఇండియా మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న మాధవన్‌కు పదోన్నతి లభించినట్లు అయింది. ఇక నుంచి వాస్ట్ డిస్నీ, స్టార్, హాట్‌స్టార్ బిజినెస్‌లతోపాటు ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ప్రాంతీయ చానెళ్ళు, డీటీహెచ్ వంటి విభాగాలు మాధవన్ పరిధిలో ఉంటాయి.