గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jul 10, 2020 , 23:38:16

ఆరుగురికి కరోనా పాజిటివ్‌

ఆరుగురికి కరోనా పాజిటివ్‌

కేశంపేట : మండలంలోని సంగెంలో మరో నలుగురు, పాపిరెడ్డిగూడ లో ఒకరికి, కాకునూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు శుక్రవారం ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్‌ శారద తెలిపారు. సంగెంలో గురువారం ఒక వ్యక్తికి కరోనా రావడంతో అప్రమత్తమైన ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు గ్రామంలో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టారు. కరో నా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు, అతడితో కలిసి తిరిగిన వ్యక్తులను పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ తెలిపారు. సంగెం, పాపిరెడ్డిగూడ, కాకునూరులలో వ్యక్తులకు పాజిటివ్‌ రావడంతో ఆయా గ్రామాల ప్రజల్లో భయాందోళన మొదలైంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను వారి ఇండ్లల్లోనే హోం క్వారంటైన్‌ చేశారు. ఇప్పటి వరకు మండలంలోని వేములనర్వలో ముగ్గురు, కొత్తపేటలో ఒకరికి పాటిజివ్‌ వచ్చింది. దీంతో మండలంలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది

పెద్ద ఎల్కిచర్లలో మహిళకు...

కొందుర్గు : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం విదితమే. అయితే అతడి కుటుంబ సభ్యులు 11మందికి పరీక్షలు చేయగా 10 మందికి నెగిటివ్‌, తల్లికి మాత్రం పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ ఝాన్సీలక్ష్మి తెలిపారు. ప్రస్తు తం ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు డాక్టర్‌ పేర్కొన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామన్నారు. కరోనా గురించి బయపడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

అందరికీ నెగిటివ్‌

మొయినాబాద్‌ : కరోనా పరీక్షలు చేసి వెంటనే ఫలితాలను ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొయినాబాద్‌లోని పీహెచ్‌సీలో మూడు రోజులుగా పరీక్ష లు చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయగా ఒక్కరికి కూడా పాజిటివ్‌ రాలేదు. అందరికీ నెగిటివ్‌ వచ్చిం ది. కాని పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్యను మాత్రం వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు.

సులువుగా కొవిడ్‌-19 పరీక్షలు 

కొత్తూరు : కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో పరీక్షలు, రిపోర్టుల విషయంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం రాపిడ్‌ యాంటిజెన్‌ కొవిడ్‌-19 పరీక్షలను క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్నది. అందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి రోజూ 20 నుంచి 50 మంది వరకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పీహెచ్‌సీలో వివిధ గ్రామాలకు చెందిన 21 మందికి పరీక్షలు నిర్వహించ గా అందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. పరీక్షలను చేసిన అర గంటలోనే రిపోర్టులు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.