బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 10, 2020 , 23:45:31

ఆరుగురికి కరోనా పాజిటివ్‌

ఆరుగురికి కరోనా పాజిటివ్‌

యాచారం : ప్రభుత్వ వైద్యాధికారిణి నాగజ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో కరోనా టెస్టులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం 25మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. యాచారం మండలానికి చెందిన ముగ్గురు, మంచాల మండలం ఆరుట్లకు చెందిన ఇద్దరు, ఇబ్రహీంపట్నంకు చెందిన ఒకరికి  కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేసి, బాధితులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.