బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 10, 2020 , 00:16:49

20,981 మంది పాస్‌

20,981 మంది పాస్‌

  • ఇంటర్‌ సప్లిమెంటరీ రద్దుతో విద్యార్థులకు లబ్ధి 
  • ‘ద్వితీయ’ విద్యార్థులను పాస్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
  • కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితా 
  • పదిరోజుల్లో రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఫలితాలు
  • ఈ నెల 31 నుంచి మార్కుల మెమోలు జారీ
  • ప్రకటన విడుదల చేసిన మంత్రి సబితారెడ్డి 
  • రంగారెడ్డి జిల్లాలో 18,392 మంది విద్యార్థులకు ప్రయోజనం 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ :  కరో నా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు మంత్రి ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 17,462 మంది జనరల్‌ విద్యార్థులు, 930 ఒకేషనల్‌ విద్యార్థులు మొత్తం 18,392మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.  ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఐవో సుధారాణి తెలిపారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 57,638 మంది పరీక్షలు రాయగా 41,076మంది 71శాతం ఉత్తీర్ణత సాధించి 2వ స్థానంలో నిలిచారు. ద్వితీ య సంవత్సరంలో 33,145మంది బాలురు పరీక్షలు రాయగా 21,665 మంది 65శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 26,044 మంది బాలికలు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాయ గా 19,901మంది 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఫెయిల్‌ అ యిన విద్యార్థులకు మేలు జరిగినట్లయింది. జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి డీఐవో వివరాలు వెల్లడించారు.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా దృష్ట్యా ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలపై రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉత్తీర్ణత పొందిన విద్యార్థులందరూ కంపార్ట్‌మెంట్‌లలో ఉత్తీర్ణులయినట్లు మార్కుల మెమోలో పొందుపర్చనున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 2589మంది ద్వితీయ సంవత్స రం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఉత్తీర్ణులైనవారిలో బాలురు 1407, బాలికలు 1182మంది ఉన్నారు. అదేవిధంగా ఒకేషనల్‌కు సంబంధించి 225మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. అయితే ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31 నుంచి సంబంధిత కాలేజీల్లో మార్కుల మెమోలను పొం దవచ్చని ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా రీ కౌం టింగ్‌, రీ వెరిఫికేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల్లో వెల్లడించనున్నట్లు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. మరోవైపు ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తూ నిర్ణయించిన ప్రభుత్వం... ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సం బంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రథమ సంవత్సరంలో 4608మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.