బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jul 09, 2020 , 23:54:24

ప్రతి మొక్కను సంరక్షించాలి

ప్రతి మొక్కను సంరక్షించాలి

  •  పరిగి నియోజకవర్గంలో మొక్కలు నాటిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి

పరిగి : మొక్కల పెంపకాన్ని  ప్రతిఒక్కరూ  బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. గురువారం పరిగి మండలం రంగాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం, పట్టణం హరితమయంగా మారాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. 

అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ 

జాతీయ రహదారి మధ్యలో గల అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలను పురపాలక స్థలంలో ఏర్పాటు చేసేందుకు గురువారం మంత్రి పి. సబితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.  కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీటీసీల ఫోరమ్‌ మాజీ అధ్యక్షుడు ఎ.సురేందర్‌కుమార్‌ పాల్గొన్నారు

మొక్కలను పరిశీలించిన ఎమ్మెల్యే 

పరిగి మండలం సాలిప్పలబాటతండా గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ భూమిలో నాటిన మొక్కలను గురువారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిశీలించారు. 50హెక్టార్ల భూమిలో సుమారు 33వేల మొక్కలు నాటనున్నట్టు అటవీ శాఖ రేంజర్‌ అబ్దుల్‌హాయ్‌ ఎమ్మెల్యేకు తెలిపారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి

దోమ : గ్రామాల్లో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. దోమ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో దోమల నివారణకు ఉపయోగపడే ఫాగింగ్‌ మిషన్‌ యంత్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజిరెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, వైస్‌ ఎంపీపీ మల్లేశం, రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మయ్యముదిరాజ్‌ పాల్గొన్నారు.