గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jul 08, 2020 , 23:06:39

వాన కురిసే.. రైతు మురిసే..

 వాన కురిసే.. రైతు మురిసే..

ఇబ్రహీంపట్నం రూరల్‌ : వరుణదేవుడు కరుణించడంతో వ్యవసాయ పనుల్లో అన్నదాతలు తలమునకలయ్యారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  జొన్న, కందు లు, పత్తి, ఇతర కూరగాయల పంటలకు ప్రాణం పోసింది. బోరుబావుల కింద ఉన్న నీటికి వర్షపు నీరు తోడు కావడంతో ట్రాక్టర్లు, నాగళ్లతో కరిగట్లు దున్ని, నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. మండలంలోని రాయపోల్‌, ముకునూరు, కప్పాడు, తులేకలాన్‌, దండుమైలారం, చర్లపటేల్‌గూడ, నెర్రపల్లితో పాటు జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.