గురువారం 13 ఆగస్టు 2020
Rangareddy - Jul 06, 2020 , 01:19:23

వ్యవసాయ రంగంలో మార్పు కోసమే రైతు వేదికలు

వ్యవసాయ రంగంలో మార్పు కోసమే రైతు వేదికలు

  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

మహేశ్వరం: వ్యవసాయ రంగంలో మార్పు కోసమే రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మహేశ్వరం మండల కేంద్రంలో నిర్మించనున్న రైతు వేదికల పనులను ఆయన పరిశీలించారు. ఈసంద్భంగా ఆయన మాట్లా డు తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేం దుకే రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివ రించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రైతుల సంక్షే మం విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం   టుందన్నారు. రైతులు వారు పండించిన పంటలకు  కావ  ల్సిన ధరలను నిర్ణయించుకునేందుకు ఈ వేదికలు ఉప  యోగపడుతాయని వీటిని  సద్వినియోగం చేసుకొని వారి హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్‌ ఆర్‌పీ జ్యోతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురసాని వరలక్ష్మి సురేందర్‌రెడ్డి,  సిరిగిరిపురం సర్పంచ్‌ కాసుల సురేశ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మంగళపల్లిలో  స్థల పరిశీలన

ఆమనగల్లు : మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఆది  వారం రైతువేదిక నిర్మాణం కోసం వైస్‌ ఎంపీపీ అనం తరెడ్డి, సర్పంచ్‌ నర్సింహారెడ్డితో కలిసి అధికారులు స్థలాన్ని పరిశీలించారు.  అనంతరం గ్రామ పంచాయతీ కార్యా లయం ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ చందర్‌రావు మాట్లాడారు. రైతువేదిక నిర్మాణం కోసం గ్రామ  కంఠం భూమి అనువుగా ఉంటుందని ప్రజాప్రతిని ధులు, అధి కారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

 200 గజాల స్థలం వితరణ

 రైతువేదిక నిర్మాణం కోసం వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి 200 గజాల స్థలాన్ని వితరణ చేస్తూ గ్రామ సర్పంచ్‌, అధి కారుల సమక్షంలో పత్రాన్ని అందజేశారు. దీంతో అధి కా రులు, రైతులు వైస్‌ ఎంపీపీని అభినందించారు. కార్యక్ర మంలో ఉప సర్పంచ్‌ సాయికుమార్‌, మాజీ ఎంపీటీసీ జం గయ్య, మురళి, శేఖర్‌, నర్సింహ, జగన్‌, సురేందర్‌, కృష్ణ య్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.logo