సోమవారం 03 ఆగస్టు 2020
Rangareddy - Jul 06, 2020 , 01:12:35

వైభవంగా గురుపౌర్ణమి

వైభవంగా గురుపౌర్ణమి

  • ప్రత్యేక పూజలు చేసిన భక్తులు 
  • పలుచోట్ల అన్నదానాలు సామూహిక వ్రతాలు
  •  మొక్కులు చెల్లించుకున్న దంపతులు  

షాద్‌నగర్‌టౌన్‌ : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని సాయిబాబా దేవాలయంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలను శేషసాయి సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం దేవాలయం ఆవరణలో శానిటైజర్‌ను ఏర్పాటు చేశారు. భక్తులు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న అనంతరం బాబాను దర్శించుకున్నారు. ఇందులో భాగంగానే ఉదయం నుంచే దేవాలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ బాబాను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ట్రాస్టు సభ్యులు తెలిపారు. అనంతరం దేవాలయం ఆవరణలో కౌన్సిలర్‌ వెంకట్రాంరెడ్డి సేవా బృంధం సభ్యులతో కలిసి పూల మొక్కలను నాటారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, కన్వీనర్‌ సుధాకర్‌, దేవాలయ మేనేజర్‌ సంతోష్‌, సేవా బృంధం సభ్యులు , అర్చకులు పాల్గొన్నారు.

     పరిగి : గురుపౌర్ణమి సందర్భంగా పరిగిలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షిరిడి సాయిబాబాను భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. 

    కడ్తాల్‌ : మండల కేంద్రంలోని షిర్డీ సాయి ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రధాన పూజారి వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఉదయం షిరిడి సాయిబాబాకు ఉదయం అభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో లలితా సహస్రనామ పారాయణాలు, సాయి వ్రతాలు, హారతి నిర్వహించారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, మల్లప్ప, జంగారెడ్డి, మల్లారెడ్డి, విష్ణువర్ధన్‌జీ, ఈశ్వరప్ప, ప్రేమ్‌కుమార్‌, సాయిప్రభు, శ్రీకాంత్‌, మహేశ్‌, మల్లికార్జున్‌, శేఖర్‌, రాములు పాల్గొన్నారు.logo