గురువారం 13 ఆగస్టు 2020
Rangareddy - Jul 06, 2020 , 01:06:56

స్వ‌చ్ఛ‌త కోసం ప‌ది నిమిషాలు

స్వ‌చ్ఛ‌త కోసం ప‌ది నిమిషాలు

  • విద్యాశాఖ మంత్రి  సబితారెడ్డి  

రంగారెడ్డి.నమస్తే తెలంగాణ :  ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు పరిసరాలను శుభ్రం చేసుకుని స్వచ్ఛతకు పాటుపడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తన ఇంటి పరిసరాల్లోని మొక్కల కుండీల్లో నీటిని తొలగించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తమ ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిని తొలగించడంతోపాటు తాగునీటి ట్యాంకులను శుభ్రం చేశారు.    


logo