శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jul 01, 2020 , 23:15:46

అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

 అబ్దుల్లాపూర్‌మెట్‌: కోవిడ్‌-19 కరోనా వైరస్‌ రోజు రోజుకూ విజృంభిస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి వ స్తున్న వారితో కరోనా కేసులు పెరుగుతుండడం తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమా నా విధిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవడంలేదు. కూరగాయలు, కిరాణా దుకాణాలు, చికెన్‌, మటన్‌ సెం టర్ల వద్ద భౌతిక దూరాన్ని పాటించకపోతో కేసుల సంఖ్య పెరుగుతుందని భావించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం దుకాణదారులు, గ్రామ పెద్దలతో సమావేశమై పదిరోజుల పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించాలని ఇప్పటికే తీర్మాణం చేసింది. ఉద యం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్‌ ప్రమాణాలు పాటిస్తూ.. అవసరమైన అన్ని దుకాణాలు తెరుస్తున్నారు.  ఒంటి గంట తర్వాత అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా బంద్‌ చేసి లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కరోనాను కట్టడి చేసేందుకు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ మన కుటుంబాన్ని, గ్రామాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆరోగ్య కేంద్రం వైద్యులు చెపుతున్నారు. ఎవరికైనా జబ్బు, జ్వరం, దగ్గు లాంటివి ఉంటే స మీపంలోని వైద్యులను సంప్రదించాలని తెలిపారు.