మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Jul 01, 2020 , 22:59:28

ఆదాయం పెంపుతోనే అభివృద్ధి సాధ్యం

ఆదాయం పెంపుతోనే అభివృద్ధి సాధ్యం

కొడంగల్‌ : ఆదాయం పెంపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రతి భవనానికి అనుమతి తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌కుమార్‌కు సూచించారు. రోడ్లు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలని, ఇంటి ఆవరణలో పెంచే మొక్కలను ప్రజలకు అందించాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని కార్గిల్‌ కాలనీలో నిర్వహిస్తున్న మిషన్‌ భగీరథ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం తాసిల్దార్‌ కార్యాలయంలో మొక్కలు నాటి, మార్కెట్‌ యార్డులో నాటిన మొక్కల స్థితిగతులను పరిశీలించారు. డాక్టర్స్‌ డేను పురస్కరించుకొని కొడంగల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు కరోనా కిట్లను  మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాజేందర్‌తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్లు సాకేత్‌, గౌతం, సాయిరెడ్డి  పాల్గొన్నారు. 

మోడల్‌ గ్రామాల్లో పనులు ఆదర్శంగా ఉండాలి

బొంరాస్‌పేట : మోడల్‌ గ్రామ పంచాయతీలుగా ఎంపి క చేసిన గ్రామాల్లో చేపట్టే పనులు ఇతర గ్రామాల నుంచి వచ్చి చూసే వారికి ఆదర్శంగా ఉండాలని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. మండలంలోని మోడల్‌ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేసిన ఎక్కచెరువుతండా, గౌరారం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రభు త్వం ఎంపిక చేసిన మోడల్‌ గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కచెరువుతండాలో ప్రకృతి వనం ఏర్పాటు చేసే స్థలాన్ని, శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డు నిర్మాణాలను, శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ కోసం కచ్చకాయ మొక్కలు నాటడానికి తీసిన గుంతలను అదనపు కలెక్టర్‌ పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో హరినందనరావు, సర్పంచ్‌ కమ్లీబాయి, టీఆర్‌ఎస్‌ నాయకుడు టీటీ రాములు, ఏపీవో రజనీకాంత్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్తుల సమాచారం ఇవ్వండి

కులకచర్ల : ప్రభుత్వ ఆస్తులను రెండు, మూడు రోజుల్లో వెలికి తీసి సమాచారం అందించాలని వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో రికార్డులు, ధరణి, ప్రభుత్వ భూములు, ఆస్తులపై సమావే శం నిర్వహించారు. భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్‌ లో పొందుపర్చాలన్నారు. ధరణి విషయంలో ఎదురవుతు న్న సమస్యల గురించి సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ అశోక్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.