గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 30, 2020 , 23:28:48

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు : పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పలువురు బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఎల్లయ్యకు రూ.లక్షా50వేలు, రమేశ్‌కు రూ.40 వేలు, రాధికారెడ్డికి రూ.29 వేలు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజురయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఢోకాలేకుండా అర్హులైనందరికీ అందజేస్తున్నదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయ దురుద్దేశంతో విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు ఎక్కడా ఏ లోటు జరుగకుండా వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యసేవలు అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందకుండా స్వీయనియంత్రణ, భౌతికదూరం పాటించి మాస్కులు ధరించి కరోనాను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.