ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 29, 2020 , 00:49:57

మరో 67 మందికి పాజిటివ్‌

మరో 67 మందికి పాజిటివ్‌

  • - జీహెచ్‌ఎంసీ పరిధిలో 43.. జిల్లాలో 1400కి చేరుకున్న కేసులు 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మరో 67 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. కలెక్టరేట్‌లో మహిళా అధికారికి కరోనా సోకింది. దీంతో జిల్లాలో నాలుగుచోట్ల పరీక్షలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ లో 43 కేసులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మరో 24 మందికి వచ్చినట్లు తేలింది. ఆదివారం నాటికి 1400మందికి చేరింది. ఇందులో 288మంది కోలుకున్నారు. 1091 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 21మంది చనిపోయారు. 3379 మంది నుంచి నమూనాలు సేకరించిన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని పోలీస్‌ అకాడమిలో రెండు రోజులుగా 180 మందికి పరీక్షలు చేశారు. మొదటిరోజు 35 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండో రోజు ఆదివారం మరో ఐదుగురికి పాజిటివ్‌గా నమోదైంది. సోమవారం నాలుగుచోట్ల వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌, జిల్లా కోర్టుతోపాటు మీర్‌పేట్‌, ఆమనగల్లులో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

వికారాబాద్‌: జిల్లాలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరిలో వికారాబాద్‌లో ఇద్దరికి, పరిగిలో ఒకరికి పాజిటివ్‌గా నమోదైంది. దీంతో కరోనా కేసులు 67కు చేరాయి. జిల్లాలో 99 మంది హోం క్వారంటైన్‌లో ఉండగా,  ఇంకా 9 మంది శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు రోడ్లపైకి వచ్చినప్పుడు భౌతికదూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.