శనివారం 08 ఆగస్టు 2020
Rangareddy - Jun 25, 2020 , 23:12:34

బాలికపై లెంగిక దాడికి యత్నం

 బాలికపై లెంగిక దాడికి యత్నం

చేవెళ్ల: 15 ఏండ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నం చేసిన సంఘట న చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ బాలకృష్ణ కథనం ప్రకారం మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామానికి చెందిన మైనర్‌ (15) ఇంటి వద్ద ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి (60) ఈనెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక కేకలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడికి రావడం తో జనార్దన్‌రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.


logo