సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Jun 25, 2020 , 22:59:21

హత్యకు కుట్ర చేసిండు.. బలైండు

హత్యకు కుట్ర చేసిండు.. బలైండు

  • అన్నహత్యకు పన్నాగం.. 
  • సినీ ఫక్కీలో బలైన తమ్ముడు
  • రియల్‌ వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • ముగ్గురు నిందితులకు రిమాండ్‌

యాచారం: తలిచిందొకటైతే.. అయ్యింది మరొకటి అన్న సామెత రియల్‌ వ్యాపారి సత్తయ్య హత్యకు సరిగ్గా సరి పోతుంది. అన్నను చంపడానికి తమ్ముడు పన్నిన కుట్రలో తానే బలైపోయాడు. ఈ ఘటన మండలంలో సంచలనం రేపింది. నిందితులు వెల్లడించిన పలు విషయాలు సినిమా ఫక్కీలో అటు పోలీసులకు.. ఇటు స్థానికులకు దిమ్మ తిరిగే లా చేశాయి. మండలంలోని గున్‌గల్‌ అటవీ ప్రాంతంలో తులేకలాన్‌ రోడ్డులో 18న చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘట న  తెలిసిందే. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరెడ్డి పర్యవే క్షణలో సీఐ లింగయ్య అధ్వర్యంలో ఎస్‌ఐ సురేశ్‌బాబు తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు జరిపి రియల్‌ వ్యాపారి హత్య కేసును ఛేదించారు. గురువారం నేరస్తులను సీఐ లింగయ్య రిమాండ్‌కు తరలించారు. 

సీఐ కథనం ప్రకారం.. మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అమీర్‌పేట సత్తయ్య (48) కందుకూరు గ్రామానికి చెందిన ఎగ్గిడి రమేశ్‌ కలిసి మూడేండ్లుగా కందుకూరు ఏరియాలో రియల్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే రమేశ్‌ సత్తయ్య వద్ద అదనంగా అప్పు కూడా తీసుకున్నాడు. ఈ విషయం ఇలా ఉండగా సత్తయ్య తన అన్న అయిన అమీర్‌పేట బీరప్పకు మధ్య కొన్నేండ్లుగా భూవివాదం కొనసాగుతున్నది. ఈ విషయంలో సత్తయ్య తన అన్న బీరప్పను హత్య చేయడానికి తన పార్ట్‌నర్‌ రమే శ్‌ సహాయం కోరి మనుషులను మాట్లాడమన్నాడు. బీరప్పను హత్య చేయడానికి రమేశ్‌ అతని అనుచరులు శ్రీశై లం, శేషగిరిలతో రూ.4లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నా రు. అడ్వాన్స్‌గా రూ.50 వేలు రమేశ్‌కు ఇచ్చాడు. పలుమా ర్లు బీరప్ప హత్య పథకం ఫలించకపోవడంతో సత్తయ్య ని రాశకు గురయ్యాడు. బీరప్పను ఎప్పుడు హత్య చేస్తారని సత్తయ్య పలుమార్లు రమేశ్‌ను, అతడి అనుచరులపై ఒత్తిడి చేశాడు. బీరప్పను వెంటనే హత్య చేయకపోతే తన 50 వేలను తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు. వారితో ఇదే విషయ మై తరచూ గొడవ పడేవాడు. 

దీంతో అతడి పార్ట్‌నర్‌ రమే శ్‌ అతడి అనుచరులు బీరప్పకు బదులుగా సత్తయ్యనే హ త్య చేస్తే సత్తయ్యకు ఇవ్వాల్సిన అప్పు డబ్బులు, బీరప్పను చంపమని ఇచ్చిన డబ్బులు, రియల్‌ ఎస్టేట్‌ వాటా డబ్బు లు తమకే మిగులుతాయని ఆలోచన చేశారు. దీనిప్రకారం సత్తయ్యను హత్య చేయడానికి రమేశ్‌ పథకం ప్రకారం ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. దీంతో సత్తయ్యను హత్య చేయడానికి శ్రీశైలం, శేషగిరిలను ఒప్పించాడు. అతడిని కారుతో ఢీకొట్టి ఆక్సిడెంట్‌గా చిత్రీకరించి మనం తప్పించుకోవచ్చని తెలిపాడు. ముందస్తు పథకం ప్రకారం ఈ నెల 18న రాత్రి 9.30 గంటల సమయంలో రమేశ్‌ సత్తయ్యకు ఫోన్‌ చేసి బీరప్ప బావి వద్ద ఒక్కడే ఉన్నడు అతడిని హత్య చేయడానికి ఇదే సరైన సమయమని వెంటనే పెత్తుల్లకు ర మ్మని కోరాడు. దుండగులు పథకం ప్రకారం సత్తయ్యను హతమార్చేందుకు ముందుగానే ప్రణాళికలను రచించుకున్నారు. నీవు ముందు నుంచి వెళ్లు.. మేము వెనుకాల నుం చి వస్తామని సత్తయ్యకు చెప్పారు. 

సత్తయ్య తన మోటార్‌ సైకిల్‌పై ముందుగా గున్‌గల్‌ అటవీప్రాంతం గుండా గేటు వైపు వెళ్తుండగా రమేశ్‌ తన టవేరా కారు(ఏపీ291188) లో వెనుకాల నుంచి సత్తయ్య ప్రయాణిస్తున్న మోటార్‌ సైకిల్‌ను బలంగా ఢీకొట్టాడు. సత్యయ్య చనిపోకపోవడంతో తిరిగి రమేశ్‌, శ్రీశైలం, శేషగిరి తమతో తెచ్చుకున్న కర్రలతో బలంగా కొట్టి చంపారు. పైగా దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేసిన యాచారం పోలీసులు సత్తయ్య హత్య కేసును ఛేదించారు. రియల్‌ వ్యాపారి సత్తయ్య హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు ఎగ్గిడి రమేశ్‌, అతని అనుచరులు శ్రీశై లం, డ్రైవర్‌ శేషగిలను కందుకూరు గేటు వద్ద అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.