శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jun 25, 2020 , 01:48:16

137 మందికి కరోనా పాజిటివ్‌

137 మందికి కరోనా పాజిటివ్‌

  •  జీహెచ్‌ఎంసీలో పరిధి ప్రాంతాల్లో 64 కేసులు
  •  నేడు కలెక్టరేట్‌ను శానిటైజ్‌ చేయనున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 

 రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో బుధవారం 137 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధి ప్రాంతంలో 64 కేసులు నమోదు కాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో 73కు వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో తేలింది. మంగళవారం రాత్రి వరకు కరోనా బాధితుల సంఖ్య 835 ఉండగా.. తాజా కేసులతో 972కు చేరుకుంది. 288 మంది కోలుకోగా 663 యాక్టి వ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 89 మంది తమ ఇండ్లలో, 92 మంది ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. అలా గే జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో 3,122 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. ఇందులో సరూర్‌నగర్‌లో 112, బాలాపూర్‌ 85, ఆమనగల్లు 87, షాద్‌నగర్‌ 45, కొండాపూర్‌ 80 చొప్పున మొత్తం 409 మందికి పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల్లో జిల్లాలో 3122మంది నుంచి కరోనాకు పరీక్షలకోసం నమూనాలు సేకరించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 

కలెక్టరేట్‌లో కలకలం..

 జిల్లా కలెక్టర్‌లో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు సమాచారం. విదేశీ ప్రయాణికుల నుంచి పాస్‌పో ర్టులు తీసుకుని  హోం క్వారంటైన్‌ అయిన తర్వాత వారికి తిరిగి పాస్‌పోర్టులు ఇచ్చేందుకు ఒక ఉద్యోగి మరో అసిస్టెంట్‌తో కలిసి పనిచేస్తున్నాడు. బుధవారం అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రిపోర్టు వచ్చింది. అయితే సదరు ఉద్యోగి సోమవారం నుంచి సెలవులో ఉన్నాడు. కొత్తపేట్‌లోని నివాసంలోనాలుగు రోజులుగా హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం మరోసారి  పరీక్షలు చేయనున్నారు. ఇదిలాఉండగా కలెక్టరేట్‌ను గురువా రం పూర్తిగా శానిటైజ్‌ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని మూసివేశారు. సోమవారం నుంచి కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేయనుంది.