బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jun 21, 2020 , 23:23:44

గ్రహణం.. వీడిన వేళ..

గ్రహణం.. వీడిన వేళ..

ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నంరూరల్‌/ మంచాల :  సూర్యగ్రహణం సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఆదివారం ఆమావాస్యతో పాటు సూర్యగ్రహణంతో ప్రజలెవరూ  ఇండ్ల నుంచి బయటకు రాలేదు. టీవీల్లో గ్రహణాన్ని వీక్షించారు. మరికొందరు ఇండ్లపైకి ఎక్కి ఎక్స్‌రేల ద్వారా గ్రహణాన్ని వీక్షించారు. అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉండటంతో పట్టింపులతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. సాగర్‌ రహదారి, మంచాల రోడ్డు, తహసీల్దార్‌ కార్యాలయం రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు  పూర్తిగా మూసివేశారు. ఆలయాలను శనివారం సాయంత్రమే మూసివేశారు. గ్రహణం విడిచిన తరువాత అన్ని ఆలయాలను పూజారులు, భక్తులు సంప్రోక్షణ చేశారు. గ్రహణం అనంతరం శివాలయంలో, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

తంబాలంలో రోకలి నిలిపి వీక్షించిన ప్రజలు..

సూర్యగ్రహణం సందర్భంగా ఇబ్రహీంపట్నంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రజలు తంబాలంలో నీరు పోసి రోకలి నిలిపి గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణ సమయంలో తంబాలంలో రోకలి నిటారుగా నిలబడి ఉంది. గ్రహణం విడిచిన తరువాత పడిపోయింది.