శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Jun 18, 2020 , 00:00:14

మరో 18 మందికి కరోనా

మరో 18 మందికి కరోనా

  • 528కి చేరుకున్న బాధితుల సంఖ్య 
  • మూడు రోజుల నుంచి జిల్లాలో 696 మంది నుంచి నమూనాలు సేకరణ 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మరో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే ప్రాంతంలో 14 కేసులు నమోదు కాగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మరో నలుగురికి వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో తేలింది. మంగళవారం రాత్రి వరకు కరోనా బాధితుల సంఖ్య 510 ఉండగా.. తాజా కేసులను కలుపుకుంటే ఈ సంఖ్య 528కి చేరుకున్నది.

వీటిలో ఇప్పటి వరకు 238 మంది కోలుకున్నారు. 254 యాక్టివ్‌ కేసులు ఉండగా..వీరిలో 53మంది తమ ఇండ్లలో, 62 మంది ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన యాక్టివ్‌ కేసులకు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో 318 మంది నుంచి శాంపుల్స్‌ సేకరించారు. ఇందులో బాలాపూర్‌లో 103, రాజేంద్రనగర్‌లో 115, కొండాపూర్‌లో 97 చొప్పున 318 మందికి పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి జిల్లాలో 696 మంది నుంచి కరోనాకు సంబంధించి నమూనాలు సేకరించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.