శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Jun 17, 2020 , 23:21:13

జాబ్‌కార్డు ఉంటే వంద రోజుల పని

జాబ్‌కార్డు ఉంటే వంద రోజుల పని

  • చెరువు కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు
  • అన్ని గ్రామాల్లో ట్యాంకులు, కాల్వల నిర్మాణం
  • వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు
  • పిచ్చి చెట్లు తొలగింపు పనులకు ప్రాధాన్యత
  • రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
  • రైతులకు అవసరమయ్యే కాల్వల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: జిల్లాలోని చెరువుల్లో పూడిక తీత, కాలువల లైనింగ్‌ పనులను ఉపాధి హామీ పనుల ద్వా రా పెద్ద ఎత్తున  చేపట్టడానికి జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను చేప ట్టేందుకు గాను లిమిటేషన్‌ లేకపోవడంతో ఈ పథకం కింద ప్రస్తుత వర్షాకాలంలో  కాల్వల్లో పూడికతీత , పిచ్చిచెట్ల తొలగింపు తదితర పనులకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాధ్యమైనంత ఎక్కువగా ఉపాధి హామీ పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కాగా, ప్రస్తుతం జిల్లాలో 50వేల మంది ఉపాధి పనులకు వస్తున్నారని వీరి సంఖ్యను ఈనెలఖారు వరకు లక్ష మందికి పెంచేందుకై చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీడీవోలకు తెలిపామని కలెక్టర్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఇతర రాష్ర్టాల నుంచి అనేక మంది తిరిగి స్వస్థలాలకు వచ్చారని, వీరందరిలో అర్హులైన వారికీ ఉపాధి పనులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఎవరికి పనులు కావాలన్న వారందరికీ ఉపాధి పనులు అందించడంతోపాటు , ప్రస్తుత వర్షాకాలంలో కాలువలు, ఫీడర్‌ చానళ్ల నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రస్తుతం 55వేల కుపైగా ఉన్న ఉపాధి కూలీల సంఖ్యను రోజుకు మూడు వేల మందిని అదనంగా పెంచాలని ఎండీవోలకు  కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఉపాధి పనుల సందర్భంగా కరోనా నియంత్రణ జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు.  కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్ట ర్లతో పాటు అదనపు కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 వికారాబాద్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ట్యాంకులు, కాలువ ల నిర్మాణం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ..  గ్రామాల్లో ఖరీఫ్‌ పనులు ప్రారంభం అవుతున్నందున అవ సరమైన కాలువలను గుర్తించి నిర్మాణ పనులు త్వరి తగతిన చేపట్టాలన్నారు. కాల్వల నిర్మాణానికి  అధికారులు అంచనాలు సిద్ధం చేసుకోవాలన్నారు.  ఏఈలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు కాలువల నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఏఈలు ప్రతి వారం ఈ పనులను  పరిశీలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ సైతం ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనాలని సూచించారు. గ్రామాల్లో ఆగ్రో ఫారెస్ట్రీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్ర ధాన రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టా లని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలా ల్లో మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజిత్‌కుమార్‌, పంచాయతీ రాజ్‌ గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, డీఆర్‌డీవో కృష్ణన్‌, ఇరిగేషన్‌ ఈఈ సుందర్‌, ఏఈలు పాల్గొన్నారు.