గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 17, 2020 , 00:05:05

విద్యుత్‌ చార్జీలను తగ్గించాలి

 విద్యుత్‌ చార్జీలను తగ్గించాలి

ఇబ్రహీంపట్నం : విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాంచందర్‌, సామెల్‌లు మాట్లాడుతూ..కరోనా ప్రజలకు కష్టాలను తీసుకువచ్చినప్పటికి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మస్కు నర్సింహ, గిరి, ఎల్లేశ్‌, శంకర్‌, స్వప్న, ఉదయ్‌ ఉన్నారు.