శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Jun 15, 2020 , 23:34:50

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను స్వయం ఉపాధి రుణాలు పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశానుసారం ఈ పథకం జిల్లాలో జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ), ఖాదీ, పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ), గ్రామ పరిశ్రమల బోర్డు (కేబీఐబీ) ద్వారా అమలవుతున్నదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా పరిశ్రమల కేంద్రానికి, గ్రామీణ ప్రాంతానికి 14యూనిట్లు, ఖాదీ, పట్టణ ప్రాంతానికి 14 యూనిట్లు,  ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్‌కు 14యూనిట్లు, గ్రామ పరిశ్రమల బోర్డుకి 32 యూనిట్లు, కేటాయించిన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి రుణాలు అందిస్తామన్నారు.  అభ్యర్థుల వయస్సు 18ఏండ్లు పైబడి ఉండాలన్నారు. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులని, గతంలో ఈ పథకంలో లబ్ధిపొందిన అభ్యర్థులు అనర్హులన్నారు. రూ.10లక్షలు పైన ఉత్పత్తి యూనిట్‌, రూ.5లక్షల పైన సేవ యూనిట్‌ స్థాపించే వారు కనీసం 8వ తరగతి చదువుకుని ఉండాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో సంప్రదించాలన్నారు.