సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Jun 13, 2020 , 01:17:29

కరువుసీమపై కరుణించిన వరుణుడు

కరువుసీమపై కరుణించిన వరుణుడు

* చెరువులు, కుంటల్లోకి భారీగా చేరిన నీరు

* పొలం పనుల్లో అన్నదాతలు

ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నంరూరల్‌ : నియోజకవర్గంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వానలు కురిశాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో భారీగా వర్షాలు కురియడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరాయి. ఇటీవల విత్తిన పత్తి, ఇతర పంటలకు ఈ వర్షాలు జీవం పోశాయి. చెరువు, కుంటల్లోకి నీరు చేరింది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలాల్లో పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దున్ని  సిద్ధం చేసుకున్నందున విత్తనాలు వేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సారి రుతుపవనాలు ముందుగానే రావడంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పంటల సాగుకోసం పొలాలు సిద్ధం చేసిన రైతులు వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో రైతులు పొలాలవైపు పరుగులు పెడుతున్నారు. పొలాల్లో పత్తి, జొన్న, కందులు, రాగులు,  మినుములతో పాటు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలను రాయితీపై అందజేస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించిన తరువాతే ఎరువుల దుకాణాలను ఆశ్రయించి విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారి సత్యనారాయణ తెలిపారు. గతంలో కంటే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున రైతులు ప్రభుత్వం నిర్దేశించిన పంటలసాగుపై దృష్టి సారించాలని కోరుతున్నారు.