శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Jun 11, 2020 , 00:23:01

భూగర్భ జలాలు పెంచేందుకు మూసీనదిపై రెండు చెక్‌డ్యాంల నిర్మాణం

భూగర్భ జలాలు పెంచేందుకు మూసీనదిపై రెండు చెక్‌డ్యాంల నిర్మాణం

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
  • శంకర్‌పల్లిలో రోడ్డు పనులకు శంకుస్థాపన

నవాబుపేట: రైతుల విషయంలో అన్ని విధాలుగా ఆలోచించే ఏకైక సర్కారు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కటేనని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని గంగ్యాడ, ముబారక్‌పూర్‌ గ్రామాల రెవెన్యూ పరిధిలో మూసీ నదిపై చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కోసం వివిధ రకాల పథకాలను అమలుచేసి వారి అభివృద్ధికి బాటలు వేసున్న దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. తాగు నీటితో పాటు సాగు నీటిని అందించి బీడు భూముల్లో సిరుల పంటలు పండించడానికి రైతులకు ప్రాజెక్టులను వరంగా ఇచ్చారని ఆమె చెప్పారు. రూ.2.10 కోట్లతో రెండు చెక్‌డ్యాంల ద్వారా మూసీనది పరీవాహక ప్రాంతంలోని బోరు బావుల్లో నీటిమట్టం పెరిగి రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దాదాపు కిలో మీటరు మేరకు భూగర్భ జలాలు పెరుతాయన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ మండలంలో అధిక విస్తీర్ణంలో మూసీనది పరివాహక ప్రాంతం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాలె భవానీ, జడ్పీటీసీ జయమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌గౌస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, నాయకులు మల్‌రెడ్డి, ముకుంద్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మాణయ్య, రాములు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

గ్రామీణరోడ్లకు మహర్దశ

శంకర్‌పల్లి: టీఆర్‌ఎస్‌తోనే గ్రామీణ రోడ్లకు మహర్దశ కలిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తా నుంచి ఫత్తేపురం చౌరస్తా వరకు రూ.3.6 కోట్లతో నిర్మిస్తున్న నాలుగులేన్ల రోడ్డు పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి, కమిషనర్‌ జైత్‌రామ్‌, ఎంపీపీ డీ.గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, గుడిమల్కాపూర్‌ ఏఎంసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌, శంకర్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ శశిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్వేతపాండురంగారెడ్డి, రాములు, నూర్జహాబేగం, లక్ష్మమ్మరాంరెడ్డి, పార్శి రాధాబాలకృష్ణ, శ్రీనాథ్‌గౌడ్‌, ఎం.చంద్రమౌళి, అశోక్‌, గోపాల్‌, సంతోశ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ కే.నారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.