గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Jun 09, 2020 , 23:52:42

ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా

ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా

  • చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
  • ఏడాది ప్రగతిపై టీఆర్‌ఎస్‌ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు నివేదిక

 వికారాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏడాది కాలంగా విశేషంగా కృషి చేసినట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. సంవత్సర కాలంలో పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు, నియోజక వర్గానికి సంబంధించిన రైల్వే సమస్యలు, కంది బోర్డు కోసం రైతుల పక్షాన ప్రస్తావించిన అంశాలు, ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేసి న తదితర అంశాలను ఎంపీ రంజిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ కార్వనిర్వహక అధ్యక్షు డు కేటీఆర్‌కు వివరించారు. అభివృద్ధే పరమావధిగా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భవిష్యత్తు ప్రగతి ప్రణాళికపై రూపొందించిన ఓ నివేదికను కేటీఆర్‌కు సమర్పించారు. ఈ సంద ర్భంగా చేవెళ్ల అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారని ఎంపీ రంజిత్‌రెడ్డి వెల్లడించారు. అభివృద్ధి అందుబాటు అన్న నినాదంతో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.