ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Jun 09, 2020 , 00:38:21

‘కాకరవాణి’పై మూడు చెక్‌డ్యామ్‌లు

‘కాకరవాణి’పై మూడు చెక్‌డ్యామ్‌లు

  • రూ.9.11కోట్లతో నిర్మాణాలు
  • మహంతిపూర్‌ సమీపంలో శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

బొంరాస్‌పేట : కాకరవాణి నదీ పరివాహక ప్రాంతంలో చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నామని కొడంగల్‌ ఎమ్మె ల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మహంతిపూర్‌ గ్రామానికి సమీపంలోని కాకరవాణినదిపై రూ.3.28కోట్లతో నిర్మించే చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో మహిళా సంఘాలకు రూ.కోటి కొవిడ్‌ రుణాలను పంపిణీ చేసి మహంతిపూర్‌లో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కాకరవాణి నదీ పరివాహక ప్రాంతంలో రూ.9.11 కోట్లతో మూడు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామని, వీటి నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి రైతులు పంటలు పండించడానికి ఉపయోగపడుతాయన్నారు. చెక్‌డ్యాంలను రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ కారణంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోడానికి ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి రూ.5వేల రుణాలను అందిస్తుందన్నా రు.  మహంతిపూర్‌ గ్రామానికి రెండు నెలల్లో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని, కొత్తూరుకు రోడ్డు నిర్మిస్తామని, గ్రామంలో సీసీ రోడ్లు మురుగు కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణాదేశు, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, పార్టీ నాయకులు రమణారెడ్డి పాల్గొన్నారు.