బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Jun 08, 2020 , 00:16:45

ఘనంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

 ఘనంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

 ఆశీస్సులు అందజేసిన మంత్రి కేటీఆర్‌- నియోజకవర్గ వ్యాప్తంగా కేక్‌ కట్‌ చేసిన కార్యకర్తలు-ప్రభుత్వ దవాఖానల్లో పండ్లు పంపిణీ   

తాండూరు : యువతరానికి ఆద ర్శం, సేవకు నిలువెత్తు నిదర్శనమైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కట్‌ చేశారు. అధికారులు, నాయకులు, కార్యకర్తలు గజమాల, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరులోని జిల్లా దవాఖానలో నాయకులు, అభిమానులు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని తాండురు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యంగ్‌లీడర్‌ ప్రతినిధులతో పాటు అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించి రాజకీయ రంగంలో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. 

కేటీఆర్‌ ఆశీస్సులు...

పుట్టిన రోజును పురస్కరించుకుని మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని అభినందిస్తు ఆశీర్వదించారు. ట్వీట్టర్‌లో కూడా మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలుపలేని ప్రముఖులు, నేతలు, అభిమానులు ట్విట్టర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో పాటు ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు ఆశీస్సులు తెలిపిన వారికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.