బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Jun 05, 2020 , 00:14:56

నేడు మంత్రి సబితారెడ్డి రాక

 నేడు మంత్రి సబితారెడ్డి రాక

బషీరాబాద్‌: నియంత్రిత వ్యవసాయ సాగుపై నియోజక వర్గ రైతులకు అవగాహన కల్పించేందుకుగాను విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి శుక్రవారం తాండూరుకు విచ్చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బషీరాబాద్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వారు తెలిపారు.