సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - May 30, 2020 , 23:27:05

2న కలెక్టరేట్‌పై మంత్రి సబితారెడ్డి పతాకావిష్కరణ

2న కలెక్టరేట్‌పై మంత్రి సబితారెడ్డి పతాకావిష్కరణ

  • సరూర్‌నగర్‌ స్టేడియంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళి 
  • అధికారుల సమీక్ష సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ హరీశ్‌

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరీశ్‌ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీ సభలను ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జూన్‌ 2న సరూర్‌నగర్‌ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి, నివాళులర్పిస్తారని తెలిపారు. ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తోపాటు సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు హాజరవుతారని చెప్పారు. జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 9 గంటలకు మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.