ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - May 28, 2020 , 23:03:28

జిల్లాలో కరోనా కలవరం

జిల్లాలో కరోనా కలవరం

  • మరో 30 పాజిటివ్‌ కేసులు 
  • ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 215 నమోదు
  • ఇంటింటా ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు కలవరం పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం 30 కేసులు నమోదైన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటిచింది. సరూర్‌నగర్‌లో నలుగురికి ప్రైమరీ కాంటాక్టు ద్వారా కరోనా పాజిటివ్‌ అని తేలింది. గడ్డి అన్నారం ‘గంగ థియేటర్‌' సమీపంలో నివాసం ఉండే ఓ మెడికల్‌ రిప్రజెంటీవ్‌కు కరోనా సోకింది. ఎన్‌టీఆర్‌ నగర్‌లో మరో 3 కేసులు నమోదయ్యాయి. బాలాపూర్‌ మండలం పహాడీషరీఫ్‌ పరిధిలో 16, రాజేంద్రనగర్‌లో ఒకటి, బండ్లగూడ ఒకటి, చందనగర్‌లో రెండు పాజిటివ్‌ కేసులను నిర్ధారించారు. జియాగూడ అంత్యక్రియాలకు వెళ్లిన షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. అయితే ఆమె స్థానికంగా హోట ల్‌ నిర్వహిస్తున్నది. ఆ హోటల్‌లో ఎంతమంది టిఫిన్‌ చేశారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీస్తున్నది. ఫరూఖ్‌నగర్‌లోని ఓ మహిళకు వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బాధితులు నివాసం ఉన్న ఇంటికి సమీపంలోని 100 నివాసాలను ఎంపిక చేసి కంటైన్మెంట్‌ జోన్లుగా వైద్యాధికారులు గుర్తించారు. 

ఇంటింటికీ వైద్య పరీక్షలు చేస్తూ కరోనా వ్యాధి వ్యాప్తి నిర్మూలనపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిపిస్తున్నా రు. కంటైన్మెంట్‌ జోన్‌లో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు. ఎవరు కూడా బయటకు రావద్దని సూచించారు. మొయినాబాద్‌ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌ గ్రామానికి చెం దిన ఓ వ్యక్తి (55)నగరంలోని షేక్‌పేట నాలా ప్రాంతం లో హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్సులో పని చేస్తున్నాడు. అయితే మూడు రోజులు క్రితం జ్వరం రావడం తో నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్‌ దవాఖానలో చేరాడు. అయితే అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని నిర్ధారించారు. జిల్లాలో బయటపడుతున్న ప్రతి కేసు వెనుక నగరంలోని జియాగూడ కేసు లింకుతో ముడిపడి ఉంది. జిల్లాలో అత్యధికంగా పహాడీషరీఫ్‌, సరూర్‌నగర్‌, షాద్‌నగర్‌, మొయినాబాద్‌, శేరిలింగంపల్లి, బాలాపూర్‌ ఏరియాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కంటైన్మెంట్‌ జోన్‌లో సర్వీలెన్స్‌ టీం ఇంటింటా సర్వే చేపట్టింది. ఆయా బృందాలతో 2 వేల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఈ బృందాలు గుర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 215 కేసులు నమోదయ్యాయి 

ఎన్కతలలో 21 మంది హోం క్వారంటైన్‌

మోమిన్‌పేట్‌ : గ్రామంలోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, ఆశవర్కర్లు సూచించారు. గురువారం మండలంలోని ఎన్కతల గ్రామంలో 21 మందిని హోం క్వారంటైన్‌ చేశామన్నారు. అయితే ధారూరు మండలంలోని గట్టేపలిలో విందు కార్యక్రమానికి కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వంటలు చేయగా అక్కడికి గ్రామం నుంచి 21 మంది వెళ్లిన వారిని ముందస్తుగా అధికారులు గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఈ 21 మంది కుటుం బ సభ్యులతో కలిపి 96 మందిని 14 రోజుల వరకు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. వీరిలో ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆశ వర్కర్లను సంప్రదించాలన్నారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు కారోనా వచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లి వచ్చారనే భయంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. దీంతో గ్రామస్తులు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి బయటికి రావాలని కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, ఆశ వర్కర్లు సూచించారు. ఎవరికైనా అనవసరంగా బయటకు రావద్దని, బయటకు వస్తే మాస్కు లు ధరించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలన్నారు.