ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - May 27, 2020 , 01:23:32

పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

పదో తరగతి పరీక్షా కేంద్రాల పరిశీలన

  • భౌతికదూరం పాటించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు 

పరిగి : పరిగి, దోమ, పూడూరు మండలాల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాలను మండల విద్యాధికారి హరిశ్చందర్‌ మంగళవారం పరిశీలించారు. కరోనా నేపథ్యంలో  పరీక్షల కోసం అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పరిగిలో బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌, శ్రీ సరస్వతి శిశుమందిర్‌, దోమలో విస్డమ్‌ పాఠశాల, కేజీబీవీ, పూడూరులో కేజీబీవీల్లో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ఎంఈవో తెలిపారు. గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు, బెంచీకి ఒకరు  చొప్పున కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతామన్నారు.   డ్యూయల్‌ డెస్క్‌లు అదనంగా అవసరమవుతున్నందున పరిగిలోని జడ్పీహెచ్‌ఎస్‌ నం.1లో 35, శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో 150 , తుంకులగడ్డ గురుకుల పాఠశాలలో 20,    దోమ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో 35  , దాదాపూర్‌ ఉన్నత పాఠశాలలో 150 , పూడూరులోని చన్గోముల్‌ ఉన్నత పాఠశాలలో 150 బెంచీలు అదనంగా అవసరమవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.