బుధవారం 08 జూలై 2020
Rangareddy - May 24, 2020 , 23:00:32

మండుతున్న ఎండలు

మండుతున్న ఎండలు

  • రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు 
  • తల్లడిల్లుతున్న ప్రజలు

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు సురుక్కుమంటున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా..  వికారాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో  డిగ్రీలు నమోదైంది.  వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 

తాండూరు: గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం ఎండలు మండుతున్నాయి. వారం నుంచి జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతూ వస్తున్నాయి. నియోజకవర్గంలో నాపరాళ్ల గనులు ఉండడంతో ఈ ప్రాంతంలో ఎండలు మరింత మండిపోతున్నాయి. ఆదివారం జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.2గా నమోదై ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇది రికార్డు స్థాయిగా మారింది. దీంతో వేడి, ఉక్కపోత తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. మూగజీవాలు కూడా అలమటిస్తున్నాయి. ప్రజలు జ్యూస్‌ సెం టర్లు, ఇతరత్ర పానీయాల కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మధ్యా హ్నం పూట బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే రక్షణగా టోపీలు, గొడుగులు, కండువాలు తలపై కప్పుకొని వెళ్తున్నారు. 

నాపరాళ్ల కార్మికులకు కష్టాలు...

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా రెండునెలల పాటు నాపరాతి, సుద్ద గనుల పనులు నిలిచాయి. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో నాపరాతి గనుల పనులు, పెద్దేముల్‌ మండల పరిధిలో సుద్దగనుల్లో పనులు ప్రారంభంతోపాటు తాండూరు మున్సిపల్‌ పరిధిలో పాలిషింగ్‌ యూనిట్లలో పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడే  పనులకు వెళ్తున్న కార్మికులకు భానుడి విశ్వరూపంతో వేడిమి, ఉక్కపోతతో సతమతమవుతున్నారు. 

నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లో క్వారీలు, సుద్దగనులు, నాపరాళ్ల పాలిషింగ్‌ యూనిట్లు ఉండడంతో తాండూ రు పరిసరాల్లో ఎండల వేడి  అధికంగా ఉంటోంది. జిల్లాలో వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల తో పోలిస్తే తాండూరులో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. తాండూరు ప్రాంతంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  భరించలేని వేడిమి ఉండడంతో పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడం లేదు. 

విధిగా జాగ్రత్తలు పాటించాలి

ఎండలకు ప్రజలు జా గ్రత్తలు పాటించాలి. అత్యవసరం అనుకుం టే తప్ప బయటకు వెళ్లరాదు. ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ,  నెత్తిన తెల్లటి బట్ట వేసుకొని వెళ్లాలి. ఎక్కువ నీటిని తాగా లి. వడదెబ్బ బారినపడకుండా పెరుగు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీటిని తాగాలి. తాటి ముంజలు, పుచ్చకాయతో పాటు నిమ్మజాతి పండ్లు తినడం మంచిది. వదులుగా ఉన్న కాటన్‌ దుస్తులు ధరించాలి. గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలి.  

-  డాక్టర్‌ జయప్రసాద్‌, జిల్లా సర్కారు దవాఖాన జనరల్‌ సర్జన్‌


logo