బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - May 23, 2020 , 23:44:40

ప్రజాప్రాతినిథ్యం పరమ పవిత్రం

ప్రజాప్రాతినిథ్యం పరమ పవిత్రం

 • సేవా దృక్పథం, అభివృద్ధి చేసే సంకల్పంతోనే రాజకీయాల్లోకి..
 • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం
 • వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌  ప్రయత్నం
 • ఫార్మాసిటీ గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తా..
 • ఐటీ  కృషి, అమెజాన్‌ డాటా సెంటర్‌ను తీసుకొచ్చాం
 • కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనేప్రధాన లక్ష్యం 
 • చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి
 • ఎంపీగా ఏడాది  పూర్తి..
(రంగారెడ్డి, నమస్తే తెలంగాణ)
ప్రజాప్రాతినిథ్యం పరమ పవిత్రం. ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఓ యోగం. అది అందరికీ రాదు. అలాంటిది తనకు దక్కడం అదృష్టమని.. సేవా దృక్పథం తో, అభివృద్ధి చేసే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆయన ఎం పీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహకారం తో, ప్రజల అండతో ముందుకు వెళుతున్నాను. ఎంపీగా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర సమస్యలను దేశ అత్యున్నత చట్టసభలో ప్రస్తావించే అవకాశాన్ని భుజస్కంధాలపై పెట్టారు. త్రికరణశుద్ధితో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని తెలిపారు. 2018 సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ తన నాలుగున్నరేండ్ల పాలనలో చేపట్టిన ప్రగతి నివేదన సభ పెట్టి ప్రజలకు చెప్పారు. అదే స్ఫూర్తితో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఏడాది పాలనపై ‘ప్రగతి నివేదన’ ద్వారా తన పనితీరును ప్రజల ముందు ఉంచినట్లు వివరించారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ పూర్తి స్థాయిలో సహకరించారని తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో చేపట్టిన పనులను వివరించారు.
వికారాబాద్‌ ఆయుష్‌ వైద్యశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేసినట్లు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి వెల్లడించారు. వికారాబాద్‌ ప్రయాణికుల కష్టాలు తీర్చడానికి వీలుగా రాష్ట్ర రోడ్లు భవనాల, అప్పటి రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి లేఖ రాసి పరిష్కరించినట్లు చెప్పారు. రాజేంద్రనగర్‌ వెటర్నరీ కాలేజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 
హైదరాబాద్‌ ఫార్మాసిటీకి కేంద్రం నిధులు ఇవ్వాలని, నిమ్జ్‌ ఉత్పత్తి కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేయగా.. సంబంధిత కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ స్పందించి ఫార్మాసిటీని నిమ్జ్‌గా ప్రకటించారని గుర్తు చేశారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఓవర్‌ బిడ్జ్రీలు నిర్మించాలని కోరినట్లు చెప్పారు. శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న సర్వీస్‌ రోడ్లకు లింకైన రోడ్లను తొలగిస్తే ఆయా గ్రామాల రైతులకు ఇబ్బందులు వస్తాయని రైతుల తరఫున విన్నవించినట్లు తెలిపారు. శంషాబాద్‌ ఆర్‌బీ నగర్‌, మధురానగర్‌లలో మంచినీటి సమస్యలను పరిష్కరించినట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. శంషాబాద్‌ అండర్‌ బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పరిగి నియోజకవర్గం దోమ మండలంలో పలు గ్రామాల్లో ప్రైవేట్‌ స్థలాలను కొనుగోలు చేసి, డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేశామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మీర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.8.33లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేసినట్లు వివరించారు. కరోనా నివారణకు పోలీసులకు సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల తరపున రూ.17.5లక్షలను సీఎం సహాయ నిధికి అందించినట్లు పేర్కొన్నారు. పలు సమస్యలు, అంశాలపైనే కాకుండా, కరోనా ఎఫెక్ట్‌తో కుదేలైన రాష్ర్టాలకు ఆర్థిక వ్యవస్థలను ఆదుకోవడానికి తగిన విధంగా స్పందించాలని కోరుతూ ప్రధాన మంత్రి మోడీకి లేఖలు రాసినట్లు వెల్లడించారు. వచ్చే నాలుగేండ్లు మరింత అభివృద్ధి, సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టం చేశారు.

ఎంపీ ల్యాడ్స్‌ నుంచి నిధుల కేటాయింపు ఇలా..

 1. వ్యవసాయశాఖ అభివృద్ధికి రూ.10లక్షలు
 2. పంచాయతీరాజ్‌శాఖ అభివృద్ధికి రూ.60లక్షలు 
 3. పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.33లక్షలు
 4. వైద్య, ఆరోగ్యాభివృద్ధికి రూ.4.5లక్షలు
 5. రహదారులు, భవనాల అభివృద్ధికి రూ.80లక్షలు

చట్టసభలో లేవనెత్తిన అంశాలు

 1. గోదావరి-ప్రాణహిత కారిడార్‌ని నిర్మించాలని, వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం
 2.  జాతీయ రహదారుల భద్రతపై ప్రశ్నించి, ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టడం
 3.  హైదరాబాద్‌ ఫార్మాసిటీకి కేంద్ర నిధులు ఇవ్వాలని, నిమ్జ్‌ ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేయాలని.. 
 4. తాండూరులో వంద పడకల ఈఎస్‌ఐ దవాఖానను ఏర్పాటు చేయాలని.. 

 1. చేపట్టిన పనులు


 1. శంకర్‌పల్లి మండలం రావులపల్లి కలాన్‌లో రూ.36లక్షల వ్యయంతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 2. సరూర్‌నగర్‌ మండలం రామకృష్ణాపూర్‌, శ్రీకృష్ణనగర్‌లో రూ.3.23లక్షల వ్యయంతో సీసీ కెమెరాల ఏర్పాటు
 3. వికారాబాద్‌ టూరిజం అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు సీఎం ద్వారా కేటాయింపులు 
 4. కరోనా కష్టకాలంలో 10వేల మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు, పౌష్టికాహారం, గుడ్లు తదితర వస్తువుల పంపిణీ
 5. కరోనా కట్టడికి పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ తరఫున రూ.కోటి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ తరఫు న రూ.కోటి.. మొత్తం రెండు కోట్లు సీఎం సహాయ నిధికి అందజేత
 6. కరోనా ఎఫెక్ట్‌తో ఇటలీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాలకు చెందిన ఫార్మా విద్యార్థులకు అక్కడ వసతి ఏర్పాట్లతోపాటు, అధికారులతో మాట్లాడి ఇండియాకు రప్పించా