మంగళవారం 26 మే 2020
Rangareddy - May 22, 2020 , 22:56:50

పేదలకు అండగా ప్రభుత్వ పథకాలు

పేదలకు అండగా ప్రభుత్వ పథకాలు

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి  

 లబ్ధిదారులకు చెక్కుల అందజేత

బషీరాబాద్‌: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా వంటి పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ షౌకత్‌అలీ, నాయకులు కరుణం పురుషోత్తంరావు, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు నర్సింహులు, సర్పంచ్‌లు ప్రియాంక, శాంతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, నర్సిరెడ్డి, మురళిగౌడ్‌, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

యాలాల: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పేదింటి ఆడపడుచులు ఎంతో లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాలాల మండల కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 30 మందికి రూ.29 లక్షల 53 వేల 480 చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ రమేశ్‌, ఎంపీటీసీలు పురుషోత్తమరావు, గరివప్ప, ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ బుచ్చయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు బాబా పాల్గొన్నారు.


logo