మంగళవారం 26 మే 2020
Rangareddy - May 22, 2020 , 22:56:55

జూలైలో హరితహారం

జూలైలో హరితహారం

వచ్చే నెలలో గుంతల తవ్వకం

వానలు  మొక్కలు నాటేలా ఏర్పాట్లు

లక్ష్యాలు నిర్దేశించిన అధికార యంత్రాంగం

రంగారెడ్డి జిల్లాలో  లక్షలు..

వికారాబాద్‌లో  లక్షల 

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సంవత్సరం జిల్లాలో 57.93లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాలు కురువగా నే పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటనున్నా రు. గతేడాది హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తూనే.. నూతనంగా ఈ సంవత్సరం మొక్కలు నాటేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. గతంలో శాఖ ల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మొక్కలు నాటారు. జిల్లా వైశ్యాల్యం 7.5లక్షల హెక్టార్లకుగాను.. 2.16లక్షల హెక్టార్ల పచ్చదనానికి ప్రస్తుతం 29,489 హెక్టార్లు ఉన్నది. 

ప్రతి శుక్రవారం వాటర్‌ డే ..

తెలంగాణకు హరితహారంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపడుతున్నది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్ని శాఖల అధికారులతో విస్తృతంగా పర్యటించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం వాటర్‌ ఫ్రైడే ప్రారంభించారు. త్వరలోనే అధికారులకు శాఖలవారీగా మొక్కలను కేటాయించి.. ప్రతి ఇం టికి కనీసం 6నుంచి 10మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలోని 560 పంచాయతీల్లో మొత్తం 57.93లక్షల మొక్కలను పంపిణీ చేసేందుకు అధికారులు టార్గెట్‌ను నిర్దేశించుకున్నారు. జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 34.31లక్షల మొక్కలు, మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో నర్సరీల్లో 9.60లక్షల మొక్క లు, ఇతర శాఖల ఆధ్వర్యంలో 14.17లక్షల మొక్కలు పెంచుతున్నారు. జిల్లా అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలుగా ఉన్నాయి. గతేడాది 21,62,390 లక్షలు టార్గెట్‌ ఉండగా.. జిల్లాలో 86శాతం మొక్కలు బతికాయి. హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ పాల్గొనేలా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రజలందరనీ భాగస్వామ్యం చేయాలని.. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ కేంద్రాల్లోని ప్రజలందరూ హరితహారం చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఇంటింటికీ హరితహారంతో ప్రతి ఇంటికీ అధికారులు వెళ్లి మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఇంటి ఆవరణలో మొక్కలను నాటి వాటికి కుటుంబసభ్యుల పేర్లను పెట్టి కంటికి రెప్పలా సంరక్షించాలని సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో క్షేత్రస్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

నర్సరీల్లో మొక్కల పెంపకం

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేయడంతో జిల్లాలో హరితహారానికి కావాల్సినన్ని మొక్కలు అందుబాటులోకి వచ్చా యి. అన్ని రకాల మొక్కలను కొన్ని నెలల నుంచి పెంచుతున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక అవసరాలు తీర్చేందుకు వీటిని నెలకొల్పారు. పంచాయతీ పాలకవర్గాల అభిప్రా యం మేరకు పంచాయతీల్లో పెంపకం చేపట్టారు. ప్రస్తుతం ఈ నర్సరీల్లో ఈ ఏడాది 34.31లక్షల మొక్కలు పెంచుతున్నారు. వీటిని జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంస్థలు సంయుక్తంగా పల్లెల్లో నాటనున్నాయి. అలాగే మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 9.60 లక్షల మొక్కలు నాటాలని గ్రీన్‌ ప్లాన్‌లో పేర్కొన్నారు. స్థలాల లభ్యత ఉన్నచోట ఆయా మున్సిపాలిటీలు మొక్కలు పెంచుతున్నాయి. లేని చోట్ల పంచాయతీల వద్ద లేదా అటవీ శాఖ నుంచి మొక్కలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

ఇవే మొక్కలు ..

వేప, చింత, కానుగ, టేకు, దానిమ్మ, జామ, నేరేడు, తులసి, గోరింటాకు, గులాబీ, గన్నేరు, మునగ మొక్కలు ఈ జాబితాల్లో ఉన్నా యి.

అటవీ శాఖ ఆధ్వర్యంలో ..

జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో దాదాపు 20 నర్సరీల్లో పది లక్షల మొక్కలు పెంచుతున్నారు. వీటిని 450 హెక్టార్లలో విస్తీర్ణంలో ఉన్న అర్బన్‌ పార్కులు, అటవీ భూముల్లో నాటాలని నిర్ణయించారు. అటవీ  జంతువులకు ఆహారంగా ఉపయోగపడే మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జామ, అల్లనేరేడు, సీతాఫలం, మారేడు, పనస, సీమ చింత, చింత, ఉసిరి, రావి, మర్రి, మేడి, వెలగ తదితర మొక్కలను నాటుతామని జిల్లా అటవీశాఖ అధికారి భీమానాయక్‌ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.

తొలకరి పలుకరించడంతో ముందుకు..

జిల్లాలో మృగశిర కార్తె నుంచి వర్షాలు ప్రారం భం కానున్నాయి. వర్షాలు సమృద్ధిగా పడగానే హరితహారం ప్రారంభిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వేసవిలో వర్షాలు కురువడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొత్తం మీద జూన్‌ నెలలో హరితహారం కార్యక్రమం మొదలుకానుంది.

జిల్లాలో గుంతల తవ్వకం కొనసాగుతుంది: నీరజ, డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌

జిల్లాలో గుంతలు తవ్వడం కొనసాగుతున్నది. గతేడాది 21,62,390లక్షలు టార్గెట్‌ ఉండగా.. జిల్లాలో 86శాతం మొక్కలు బతికాయి. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక అవసరాలు తీర్చేందుకు నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ నర్సరీల్లో ఈ ఏడాది 34.31లక్షల మొక్కలు పెంచుతున్నారు. జిల్లా పంచాయతీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా పల్లె ల్లో మొక్కలను నాటనున్నాయి. అలాగే మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 9.60లక్షల మొక్కలు నాటాలని గ్రీన్‌ ప్లాన్‌లో చేర్చాం.

వికారాబాద్‌లో లక్ష్యం 77.96 లక్షలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వర్షాలు పడిన వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మే నెలాఖరు వరకు మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. జూన్‌ మొదటివారం నుంచి గుంతలు తీసే ప్రక్రియను చేపట్టనున్నారు. జూలైలో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఆయా శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. నాటడంతోపాటు వాటిని రక్షించేందుకు గాను ప్రతీ మొక్కకు జియోట్యాగింగ్‌ చేయనున్నా రు. ఈసారి ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలకు ప్రాధాన్యమివ్వనున్నారు. అలాగే అటవీ ప్రాంతంలో మొక్కలను నాటడంతోపాటు పునరుజ్జీవ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపా టు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. ఈ మేరకు జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

250 ఎకరాల అటవీ ప్రాంతంలో..

జిల్లావ్యాప్తంగా 250ఎకరాల్లోని అటవీ ప్రాం తంలో మొక్కలు నాటేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. ధారూరు, తాం డూరు, అన్నాసాగర్‌, తట్టేపల్లి, కల్కొడ, వికారాబాద్‌ ప్రాంతాల్లో మొక్కలను నాటనున్నారు. టేకు మొక్కలతోపాటు చైనా బాదం, కానుగ, నెమలి నార తదితర మొక్కలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 1250ఎకరాల్లో అడవుల్లో పునరుజ్జీవ కార్యక్రమం కొనసాగుతుంది. ఎండిపోయిన చెట్లను తొలగించడం, పూర్తిగా వంగిపోయిన చెట్లను తొలగించడం తదితర పనులతో అడవులకు పునరుజ్జీవం చేస్తున్నారు. దీంతోపాటు అటవీ ప్రాంతాల్లో 130 కిలోమీటర్ల మేర తీసిన కందకాల మీద గచ్చకాయ మొక్కలను నాటనున్నారు. 

ఈనెలాఖరు వరకు అందుబాటులో మొక్కలు...

ఈనెలాఖరు వరకు అన్ని నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచుతాం. మొక్కలను నాటడంతో ప్రతీ మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నాం. మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. ఈ ఏడాది అటవీ ప్రాంతాల్లోనూ మొక్కలు నాటుతాం. అడవుల్లో పునరుజ్జీవ పనులు కొనసాగుతున్నాయి. 

- డీఎఫ్‌వో వేణుమాధవ్‌

ఈ ఏడాది టార్గెట్‌ 77.96 లక్షల మొక్కలు...

వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 77.96లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అటవీశాఖ, డీఆర్‌డీఏతోపాటు ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో 49 లక్షలు, 565 గ్రామ పంచాయతీల్లో 26.03లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో 2.15లక్షల మొక్కలను నాటనున్నారు.

అటవీ శాఖ -12 లక్షలు, 

విద్యాశాఖ -1.16 లక్షలు, 

డీపీవో మరియు డీఆర్డీవో -19.82 లక్షలు

నీటిపారుదల శాఖ -90 వేలు 

ఎక్సైజ్‌ శాఖ -3.23 లక్షలు, 

వ్యవసాయ శాఖ -8 లక్షలు,

డీఎంహెచ్‌వో -20 వేలు

పోలీసు శాఖ -50 వేలు

పరిశ్రమల శాఖ -30 వేలు

ఉద్యానవన శాఖ -1 లక్ష 

జిల్లా సంక్షేమ శాఖ -15 వేలు

గిరిజన సంక్షేమ శాఖ -30 వేలు

రోడ్లు, భవనాల శాఖ -60 వేలు

గనుల శాఖ -1 లక్ష 

మార్కెటింగ్‌ శాఖ -7 వేలు

పౌరసరఫరాల శాఖ -6 వేలు

పశుసంవర్ధక శాఖ -10 వేలు

పంచాయతీరాజ్‌ శాఖ -54 వేలు

4 మున్సిపాలిటీల పరిధిలో 

2.15 లక్షల మొక్కలు

వికారాబాద్‌ మున్సిపాలిటీ- 80 వేలు

తాండూరు మున్సిపాలిటీ- 78,500 

పరిగి మున్సిపాలిటీ- 30 వేలు

కొడంగల్‌ మున్సిపాలిటీ - 26 వేలు


logo