బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - May 21, 2020 , 23:30:29

పేదల చెంతకే వైద్యం..

పేదల చెంతకే వైద్యం..

 జిల్లాలో మరో ఐదు బస్తీ దవాఖానలు

 నేడు ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు

నిరుపేదలకు  సేవలు   సంకల్పంతో  పభుత్వం బస్తీ దవాఖానల  శ్రీకారం చుట్టింది.ప్రతి ఐదు వేల నుంచి పది వేల మందికి  ఒక  ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి  మందులను అందజేస్తున్నది.  పేదలకు తక్షణ వైద్యం అందుతున్నది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 బస్తీ దవాఖానలు వైద్య సేవలు అందిస్తుండగా..  మరో 43 ప్రారంభం కానున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐదు   సబితారెడ్డి, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రారంభించనున్నారు.

 రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : నిరుపేదల చెంతకే వైద్య సదుపాయాలను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా  నేడు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదు బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న ప్రతి ఐదువేల మంది నుంచి పదివేల మందికి స్థానికంగానే వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్స, మందుల సరఫరా, ల్యాబ్‌ సదుపాయాలు తదితర సేవలను ఈ బస్తీ దవాఖానల ద్వారా అందిస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మొత్తంలో గురువారం 43 బస్త్తీ దవాఖానలు ప్రారంభం కానుండగా.. వీటిలో ఐదు బస్త్తీ దవాఖానలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. రాజేంద్రనగర్‌ పరిధి బుద్వేల్‌ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖాన, సాహెబ్‌నగర్‌ వైదేహీనగర్‌లో, సరూర్‌గర్‌ పరిధి లింగోజిగూడ అధికారినగర్‌లో, లింగోజిగూడ వార్డు పరిధి డాక్టర్స్‌ కాలనీలోని కామేశ్వరరావునగర్‌ కాలనీలో, కొండాపూర్‌ వార్డు పరిధి మసీదు బండ ప్రేమ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో కొత్త బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు.  శుక్రవారం బుద్వేల్‌, డాక్టర్స్‌ కాలనీ, కామేశ్వరరావునగర్‌లోని బస్తీ దవాఖానలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తుండగా, సరూర్‌నగర్‌ అధికారినగర్‌, సాహెబ్‌నగర్‌లోని వైదేహీనగర్‌లోని దవాఖానలను ఎల్బీనగర్‌ శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి, కొండాపూర్‌ ప్రేమ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లోని దవాఖానను శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులను జీహెచ్‌ఎంసీ ఆహ్వానించింది. 

బస్తీ దవాఖానల్లో వైద్య సేవలివే..

న్యూఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లు పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో.. ఇదే మాదిరిగా బస్త్తీ దవాఖానల పేరుతో గ్రేటర్‌లోనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 బస్తీ దవాఖానలు నడుస్తుండగా.. నేడు మరో 43  ప్రారంభం కానున్నాయి. ఈ బస్త్తీ దవాఖానాల్లో ఔట్‌ పేషెంట్‌ కన్సల్టేషన్‌, టెలీ మెడిసిన్‌ సదుపాయం, రక్త, మూత్ర పరీక్షలు లాంటి కనీస ల్యాబ్‌ డయాగ్నోసిస్‌ సదుపాయం, ఇమ్యూనైజేషన్‌, యాంటి నాటల్‌, పోస్ట్‌ నాటల్‌ కేర్‌, అనీమియా పరీక్షలు, రక్తపోటురక్తపోటు, బ్లడ్‌, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తారు.