సోమవారం 10 ఆగస్టు 2020
Rangareddy - May 21, 2020 , 01:49:49

ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి: ఎమ్మెల్యే ఆనంద్‌

ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి: ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ నుంచి కొత్తగడి వరకు బస్సులో ప్రయాణం

వికారాబాద్‌ : ఆర్టీసు బస్సుల్లో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ నుంచి కొత్తగడి వరకు బస్సులో ఎమ్మెల్యే ప్రయాణించి ప్రయాణికులకు జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. బస్సులోకి ఎక్కినప్పుడే శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రయాణికులకు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించిందని, ఈ మేరకు ప్రజలు, వ్యాపారులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు.


logo