ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - May 21, 2020 , 01:34:30

మహిళలకు అండగా ప్రభుత్వం

మహిళలకు అండగా ప్రభుత్వం

కొవిడ్‌-19 రుణాలతో చేయూత

కరోనాతో నిలిచిన అభివృద్ధి పనులు

పొదుపు సంఘాలకు రూ. 3కోట్ల రుణ పంపిణీ

వర్షాకాల వ్యాధులను అరికట్టుకుందాం

ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌ : మహిళలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని, లాక్‌డౌన్‌లో పడ్డ ఇబ్బందులను తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ కొవిడ్‌-19 రుణాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు కొవిడ్‌-19 రుణల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57రోజులుగా కరోనా వైరస్‌ ప్రభావంతో అందరూ ఇంటికే పరిమితం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి మహిళలకు ఆర్థికంగా చేయూతనందించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాల సభ్యులకు ప్రతి ఒక్కరికీ రూ. 5వేల చొప్పున రుణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో 26మెప్మా సభ్యులకు 13లక్షల 90వేలు,  మండల పరిధిలోని మహిళా సంఘం (ఐకేపీ) 6వేల సభ్యులకు రూ. 3కోట్ల మంజూరు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయన్నారు. మిషన్‌ భగీరథ పనులు ప్రారంభమై సంవత్సరం అవుతున్నా ఆయా ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హుస్సేన్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయకుంటే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఉషారాణి, కౌన్సిలర్లు ముధుసూదన్‌యాదవ్‌, వెంకట్‌రెడ్డి, శ్రీలత యాదవ్‌, శంకర్‌నాయక్‌, సాయిప్రసన్న ఎంపీడీవో సుజాత, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌కుమార్‌, యూనియన్‌ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ గోవర్ధన్‌, ఏపీఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.