శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - May 21, 2020 , 01:33:14

షాద్‌నగర్‌ బైపాస్‌రోడ్డులో ఘోరరోడ్డు ప్రమాదం

షాద్‌నగర్‌ బైపాస్‌రోడ్డులో ఘోరరోడ్డు ప్రమాదం

స్కూటీని ఢికొట్టిన డీసీఎం లారీ

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతినెత్తురోడిన రోడ్డు

 షాద్‌నగర్‌, నమస్తే తెలంగాణ :  వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వస్తుండగా తండ్రి, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి షాద్‌నగర్‌ బైపాస్‌ రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం షాద్‌నగర్‌ పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన సల్ల పాండు (40), సల్ల వరుణ్‌తేజ్‌ (11), తండ్రి, కుమారుడు స్కూటీపై వ్యవసాయ పొలం వద్దకు పాల కోసం వెళ్లారు. పాలను తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో షాద్‌నగర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న డీసీఎం లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్‌తేజ్‌ అక్కడిక్కడే మృతి చెందగా, పాండును షాద్‌నగర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాండు మృతి చెందాడు. 

మరో పది నిమిషాల్లో ఇంటికి వస్తారని భావించిన కుటుంబ సభ్యులకు తండ్రి, కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్త తెలియగానే ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనగర్‌ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనపై పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యప్తు జరుపుతున్నారు.