శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - May 16, 2020 , 00:39:22

203 జీఓతో తెలంగాణకు నష్టం

203 జీఓతో తెలంగాణకు నష్టం

  • కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్ష నాయకులు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: పోతిరెడ్డిపాడుపై నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 203ను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ... కృష్ణానదిపైన ఏపీ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం జీవో నంబర్‌ 203ను విడుదల చేస్తూ నిర్ణయం చేయడం తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడును విస్తరించి సంగమేశ్వర ప్రాంతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలు కృష్ణా నది జలాలను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీఓను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంగమేశ్వరలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం పూర్తిగా ఖాళీ అవుతుందని, అదే జరిగితే నాగార్జునసాగర్‌ ఆయకట్టు ఎండిపోతుందని, రాబోయే కాలంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీజేఎస్‌ అధ్యక్షుడు వినయ్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర నాయకుడు పుస్తకాల నర్సింగ్‌రావు, రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, టీజేఎస్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రంగారెడ్డి ఉన్నారు.