శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - May 16, 2020 , 00:37:02

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

 ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహించే వాటర్‌ డేలో భాగంగా హరితహారంలో మొక్కలకు ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు నీళ్లు పోశారు. శుక్రవారం వాటర్‌ డే సందర్భంగా పలు గ్రామాల్లో ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లుపోశారు.  హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కకు నీరుపోసి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తెలిపారు. షాబాద్‌ మండలంలోని సంకెపల్లిగూడ, ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి, రాయపోల్‌, ముకునూరు, దండుమైలారం, ఫరూఖ్‌నగర్‌ మండంలోని లింగారెడ్డిగూడలో మొక్కలకు నీళ్లుపట్టారుమాడ్గుల మండలంలోని జర్పులతండా, మాడ్గుల, ఇర్విన్‌, నర్సాయపల్లి, గిరికొత్తపల్లి, చంద్రాయణపల్లి, జయరాంతండా, గుడితండా, దొడ్లపహడ్‌లో మొక్కలకు నీరు పోశారు.కడ్తాల్‌ మండల కేంద్రంలోని హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారి డివైడర్‌పై ఉన్న మొక్కలకు నీళ్లుపోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవకోటి మనుగడకు మొక్కలు నాటాలన్నారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.    - రంగారెడ్డి బృందం