బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - May 15, 2020 , 00:40:36

గర్భవతులు పోషకాహారం తీసుకోవాలి

గర్భవతులు పోషకాహారం తీసుకోవాలి

  • ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

యాచారం: గర్భవతులు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పోషక విలువలు కలిగిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. రామకృష్ణ మఠం సౌజన్యంతో యాచారం పోలీసుల ఆధ్వర్యంలో  గర్భవతులకు గురువారం పోషక విలువలు కలిగిన రాగిపిండి, గుడ్లు, పాలు, ఖర్జూర, ఎండు ద్రాక్ష తదితరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భవతులు పౌష్టికాహారంతో పాటు ప్రతిరోజూ నీరు అధికంగా తీసుకోవాలన్నారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా దాతలు ముందుకొచ్చి వలస కూలీలు, పేదలకు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ శిల్పవల్లి, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, యాచారం సీఐ లింగయ్య, ఎస్‌ఐలు వెంకటయ్య, సురేశ్‌బాబు, మెడికల్‌ ఆఫీసర్‌ నాగజ్యోతి, సేవా సహాయ మండలి ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు ఖాజా మహ్మద్‌, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, రామకృష్ణ మఠం ప్రతినిధులు పాల్గొన్నారు.