సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - May 11, 2020 , 01:37:22

పశువులను ఢీకొన్న కారు

పశువులను ఢీకొన్న కారు

  • పశువులతో పాటు వ్యక్తికి తీవ్ర గాయాలు

చేవెళ్ల : రోడ్డు దాటుతున్న పశువులను కారు ఢీకొట్టింది. దీంతో పశువులతోపాటు ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లి గేట్‌ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. చన్‌వల్లి గ్రామానికి చెందిన హరీశ్వర్‌రెడ్డి కారులో శంకర్‌పల్లికి వెళ్తున్నాడు. ఈ సమయంలో ఈర్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు తన పశువులను రోడ్డు దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా రావడంతో పశువులను ఢీకొట్టింది. దీంతో కారు బోల్తాపడింది. అందులో మొత్తం నలుగురు ఉన్నారు. వారిలో ఒకరు తీవ్రంగా  గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని 108లో దవాఖానకు తరలించారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.