శుక్రవారం 03 జూలై 2020
Rangareddy - May 11, 2020 , 01:37:22

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

మొయినాబాద్‌ : మద్యం మత్తులో ఒక యువకుడు సెల్‌టవర్‌ పైకి ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి చెందిన ముడిమ్యాల రాములు మద్యం తాగాడు. మత్తులో ఉన్న అతను మండల కేంద్రంలోని జీ ప్లస్‌-1  భవనం మీద ఉన్న సెల్‌టవర్‌ పైకి ఎక్కాడు. స్థానికులు గమనించి అక్కడే చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న  పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ వెంకట్‌.. సెల్‌టవర్‌ నుంచి కిందికి దిగాలని రాములుకు విజ్ఞప్తి చేసినా వినకుండా మరింత పైకి ఎక్కాడు. అతను మద్యం మత్తులో ఉన్నాడని  స్థానికులు చెప్పడంతో.. పోలీసులు అతడిని కిందికి దించేందుకు  మద్యం సీసాలను ఆశగా చూపడంతో సెల్‌ టవర్‌ నుంచి రాములు కిందికి దిగాడు. మత్తులో ఉన్న అతడిని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఇంటికి పంపించారు.


logo