ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - May 10, 2020 , 01:12:12

రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు

రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు

  • రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడానికి వీలుగా పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ధాన్యం డబ్బులను వెంటనే జమ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. త్వరలోనే కందులు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఇబ్రహీంపట్నంలో 1450 మెట్రిక్‌ టన్నులు, మంచాలలో 1250, యాచారంలో 700, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో 1500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసిందని, మరో మూడువేల టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారని వెల్లడించారు. రుణమాఫీ, రైతుబంధుకు  ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నా.. విపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కోహెడ వద్ద పండ్ల మార్కెట్‌ విపత్తు కారణంగా ధ్వంసమైతే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో ఎంపీపీ కృపేశ్‌, సొసైటీ చైర్మన్‌ పుల్లారెడ్డి, మొద్దు అంజిరెడ్డి, నందారెడ్డి, రాంరెడ్డి, భరత్‌రెడ్డి, రఘుపతి, జంగారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సురేశ్‌ పాల్గొన్నారు.