బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - May 09, 2020 , 00:52:57

ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ప్రతి మొక్కనూ సంరక్షించాలి

  • ‘వాటరింగ్‌ ఫ్రై డే’గా పాటింపు 
  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాలతో హరితహారం మొక్కలకు నీళ్లు పోసిన సర్పంచ్‌లు 

రంగారెడ్డిజిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: జిల్లాలో శుక్రవారం ‘వాటరింగ్‌ ఫ్రై డే’ గా పాటించి హరితహారంలో నాటిన మొక్కలన్నింటికీ నీరు పోయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. పంచాయతీల ట్రాక్టర్లను వినియోగించుకోవాలని సూచించారు. స్పందించిన  సర్పంచ్‌లు శుక్రవారం మొక్కలకు నీళ్లు పోశారు.

నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలి

షాబాద్‌, నమస్తేతెలంగాణ: నాటిన ప్రతి మొక్కనూ కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్‌లు కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, కుమ్మరి దర్శన్‌ అన్నారు. చందనవెళ్లి, సంకెపల్లిగూడ గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరుపోశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చెన్నయ్య, ఉపసర్పంచ్‌ రాజేందర్‌రెడ్డి, రవి, వెంకటయ్య, యాదయ్య, శ్రీకాంత్‌, రవిగౌడ్‌ పాల్గొన్నారు.

సంరక్షణకు ప్రత్యేక చర్యలు

కడ్తాల్‌: మండలంలో నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. కడ్తాల్‌ లోని పలు కాలనీల్లో హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోయించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్‌, ఉప సర్పంచ్‌ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి, ఎఫ్‌ఏ వెంకటేశ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ప్రతి మొక్కా బతుకాలి

యాచారం: ప్రతి మొక్కనూ  బతికించాలని ఎంపీపీ సుకన్య అన్నారు. మండల కేంద్రంలోని మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్‌కుమార్‌, సర్పంచ్‌ శ్రీధర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ లలిత, నాయకులు భాష, జంగయ్యగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

కొత్తూరులో..

ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీడీఓ జ్యోతి అన్నారు. మండలంలోని మల్లాపూర్‌, ఎస్‌బీపల్లి, గూడూరు, మక్తగూడ, కొత్తూరు గ్రామాల్లో మొక్కలను పరిశీలించారు. ఎంపీఓ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి మంజులత, సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.