గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - May 07, 2020 , 00:55:24

మరో నలుగురికి పాజిటివ్‌..

మరో నలుగురికి పాజిటివ్‌..

రంగారెడ్డి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా మహమ్మారి పరంపర కొనసాగుతుంది. తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం వనస్థలిపురం పరిధిలో మరో మూ డు, విజయపురికాలనీలో మరో కేసు నమోదైంది. ఒకే ఇంట్లో ఇప్పటికే  మూడు రోజుల్లో తల్లి, కుమారుడికి వైరస్‌ సోకింది. ఆ ఇంట్లోనే మళ్లీ కోడలు, మనుమడు, మనుమరాళ్లు వైరస్‌ బారినపడ్డారు. ఆ ఇంట్లో ఐదుగురికి సోకడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వృద్ధుడి (65)కి వైరస్‌ సోకింది. అతడు వ్యాధిగ్రస్తుడు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు 88కి చేరగా.. వారిలో 41 మంది డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృత్యువాతపడ్డారు. 43మంది చికిత్స పొందుతున్నారు.