గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - May 06, 2020 , 00:04:18

కొహెడ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

కొహెడ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 

ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ : ప్రకృతి వైపరీత్యాలలో రాజకీయం తగదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కొహెడ మార్కెట్‌లో  షెడ్లు కూలిపోయిన ఘటనలో గాయపడి  చికిత్స పొందుతున్న వారిని మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఘటనలో గాయపడిన వారందరికి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. వారికి ప్రభుత్వమే వైద్యఖర్చులను భరిస్తుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని, రైతులు, వ్యాపారుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.