సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - May 05, 2020 , 23:59:32

కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం తప్పనిసరి

కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం తప్పనిసరి

  • జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి  
  • కొనుగోలు కేంద్రాల పరిశీలన

మంచాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి  సూచించారు. మంగళవారం నోములలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతులు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు  ఉపయోగింంచుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. నోములలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేయడంతో ఐకేపీ అధికారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఏడీఏ సత్యనారాయణ, ఏఓ జ్యోతిశ్రీ, సర్పంచ్‌ బాల్‌రాజ్‌, సహకార సంఘం చైర్మన్‌ పుల్లారెడ్డి ఉన్నారు. 

యాచారం : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి కోరారు. చింతపట్లలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను డీసీఎంఎస్‌ ద్వారా ప్రభుత్వమే కొంటుందని రైతులు అధైర్యపడొద్దన్నారు. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా రైతులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, సర్పంచ్‌ సరితారెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి సందీప్‌, వ్యవసాయ సిబ్బంది గురునాథ్‌, పురుషోత్తం పాల్గొన్నారు.